డ్రగ్స్ డీలర్ల భరతం పట్టిన దుబాయ్ పోలీసులు

- November 26, 2021 , by Maagulf
డ్రగ్స్ డీలర్ల భరతం పట్టిన దుబాయ్ పోలీసులు

యూఏఈ:దుబాయ్ పోలీసులు హై నెట్ వర్క్ కలిగిన డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేాశారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియాతో కలిసి భారీగా డ్రగ్స్ ను అక్రమంగా దేశంలోకి తరలిస్తున్న 91 మందిని అరెస్ట్ చేశారు. వీరికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్లు గుర్తించారు. పక్కా నిఘా వేసి డ్రగ్స్ వ్యాపారుల స్థావరాలపై ఆటాక్ చేసి భారీగాడ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.1342 కిలోల నార్కోటిక్స్, సైకోట్రోఫిక్ ను సీజ్ చేశారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 176 మిలియన్ల దిర్హామ్స్ ఉంటుందని పోలీసులు చెప్పారు. డ్రగ్స్ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఇంటర్నేషనల్ మాఫియా తో కలిసి దేశంలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ను వేదికగా చేసుకున్నారు డ్రగ్స్ డీలర్స్.  సోషల్ మీడియాలో డ్రగ్స్ వివరాలు పెడుతూ యూత్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక టీమ్స్ గా ఏర్పడి లోకేషన్స్ ఆధారంగా వీరిని పట్టుకున్నారు. 1342 కిలోల నార్కోటిక్స్ తో పాటు 8,09,534 కిలోల హషిష్, 4,85,491 కిలోల క్రిస్టల్ మెత్,41,888 హెరాయిన్, 1,17,480 నార్కోటిక్స్ పిల్స్,154 గ్రాముల కొకైన్  15 గ్రాముల ఓపియమ్ స్వాధీనం చేసుకున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com