ఇండియా, పాకిస్తాన్‌తో సహా ఆరు దేశాల ప్రజలకు సౌదీలోకి డైరెక్ట్ ఎంట్రీ

- November 26, 2021 , by Maagulf
ఇండియా, పాకిస్తాన్‌తో సహా ఆరు దేశాల ప్రజలకు సౌదీలోకి డైరెక్ట్ ఎంట్రీ

సౌదీ అరేబియా: ఇండోనేషియా, పాకిస్తాన్, ఇండియా, ఈజిప్ట్, బ్రెజిల్, వియత్నాం దేశాల నుండి మూడవ దేశంలో 14 రోజుల నిర్బంధాన్ని గడపకుండా నేరుగా ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు సౌదీ అరేబియా గురువారం ప్రకటించింది. కొత్త ఆదేశాలు డిసెంబర్ 1, 2021 నుండి అమలులోకి వస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దేశాల నుండి వచ్చే ప్రయాణికుల ఇమ్యునైజేషన్ స్థితితో సంబంధం లేకుండా  ఐదు రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి  ఉంటుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. COVID-19 వ్యాప్తిని ఎదుర్కొనే ప్రయత్నంలో, కొన్ని దేశాల నుండి సౌదీ లోకి నేరుగా ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయాన్ని మంత్రిత్వ శాఖ అప్‌డేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎపిడెమియోలాజికల్ పరిస్థితులను ఆరోగ్య అధికారులచే నిరంతర మూల్యాంకనం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు  సౌదీ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com