డ్రగ్స్ డీలర్ల భరతం పట్టిన దుబాయ్ పోలీసులు
- November 26, 2021
యూఏఈ:దుబాయ్ పోలీసులు హై నెట్ వర్క్ కలిగిన డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేాశారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియాతో కలిసి భారీగా డ్రగ్స్ ను అక్రమంగా దేశంలోకి తరలిస్తున్న 91 మందిని అరెస్ట్ చేశారు. వీరికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్లు గుర్తించారు. పక్కా నిఘా వేసి డ్రగ్స్ వ్యాపారుల స్థావరాలపై ఆటాక్ చేసి భారీగాడ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.1342 కిలోల నార్కోటిక్స్, సైకోట్రోఫిక్ ను సీజ్ చేశారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 176 మిలియన్ల దిర్హామ్స్ ఉంటుందని పోలీసులు చెప్పారు. డ్రగ్స్ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఇంటర్నేషనల్ మాఫియా తో కలిసి దేశంలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ను వేదికగా చేసుకున్నారు డ్రగ్స్ డీలర్స్. సోషల్ మీడియాలో డ్రగ్స్ వివరాలు పెడుతూ యూత్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక టీమ్స్ గా ఏర్పడి లోకేషన్స్ ఆధారంగా వీరిని పట్టుకున్నారు. 1342 కిలోల నార్కోటిక్స్ తో పాటు 8,09,534 కిలోల హషిష్, 4,85,491 కిలోల క్రిస్టల్ మెత్,41,888 హెరాయిన్, 1,17,480 నార్కోటిక్స్ పిల్స్,154 గ్రాముల కొకైన్ 15 గ్రాముల ఓపియమ్ స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్