'భీమ్లా నాయక్' టీజర్ ముహూర్తం ఖరారు...
- November 26, 2021
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ ట్రీట్‌పై ఊహాగానాలు పెరుగుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 14 లేదా 15 తేదీల్లో చిత్ర టీజర్‌ను లాంచ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బజ్ ఏమిటంటే టీజర్లో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, రానా ‘డేనియల్’గా కనిపించే హై ఆక్టేన్ ఇంటెన్స్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో లోడ్ చేయనున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియుమ్”కి రీమేక్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నిత్యా మీనన్‌తో, రానా సంయుక్తా మీనన్‌తో రొమాన్స్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు