యూఏఈ జాతీయ దినోత్సవాన్ని 'అంతర్జాతీయ భవిష్యత్ దినోత్సవం'గా నిర్వహించనున్న ప్రపంచం
- November 26, 2021దుబాయ్: ఐక్యరాజ్యసమితి ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో), యూఏఈ జాతీయ దినోత్సవాన్ని అంతర్జాతీయ భవిష్యత్ దినోత్సవంగా అన్ని దేశాల్లోనూ నిర్వహించేలా కీలక నిర్ణయం తీసుకుంది. యూఏఈ సాధించిన విజయాలకు ఇదొక గౌరవ సూచకంగా భావించవచ్చు. యూఏఈ ప్రధాని మరియు ఉపాధ్యక్షుడు, దుబాయ్ పాలకుడు మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డిసెంబర్ 2న యూఏఈ జాతీయ దినోత్సవం కాగా, ఇకపై అంతర్జాతీయ భవిష్యత్ దినోత్సవంగా కూడా నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో యూఏఈ సాధించిన విజయాల నేపథ్యంలో యూఏఈకి ఈ గుర్తింపు దక్కిందనీ, యూఏఈ ప్రపంచ దేశాలకు అభివృద్ధి విషయంలో మార్గదర్శకంగా మారిందని అన్నారాయన.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..