కోవిడ్‌తో హడలిపోతున్న జర్మనీ దేశం...
- November 26, 2021
కరోనా థర్డ్‌వేవ్ ముప్పు తప్పుదంటూ ఎప్పటి నుంచో వైద్య నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు.అయితే, ఇప్పుడు సౌతాఫ్రికా కొత్త వేరియంట్ అన్ని దేశాలకు కునుకులేకుండా చేస్తోంది.ఈ కొత్త వేరియంట్ జర్మనీని హడలెత్తిస్తోంది.ఆ దేశంలో కోవిడ్ కేసులు తీవ్రరూపం దాల్చాయి.రోజుకు 76 వేలకు పైనే కొత్త కేసులు వెలుగు చూస్తుండడంతో..వణికిపోతున్నారు.ఇప్పటివరకూ లక్షకు పైగా మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇక, తాజా కేసులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి.రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడిపోవడంతో ఆ రోగులను వేరే ప్రాంతాలకు, ఆస్పత్రులకు తరలించేందుకు ఏకంగా వైమానికి దళాన్ని కూడా రంగంలోకి దింపాల్సిన పరిస్థితి వచ్చింది.మెమ్మింగెన్ ఆసుపత్రుల్లో కరోనా రోగులు ఎక్కువగా ఉండడంతో ముయెన్‌స్టర్‌కు తరలించేందుకు జర్మనీ విమానంలో ఫ్లయింగ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లుగా పిలిచే ఆరు పడకల ఐసీయూని ఏర్పాటు చేసింది.కోవిడ్ కారణంగా విమానాలను వినియోగించడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు అధికారులు..
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!