ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యవసర సమావేశం
- November 27, 2021
న్యూ ఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతన ఈరోజు ఉదయం 10:30 గంటలకు అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి, కీలక అధికారులు హాజరుకాబోతున్నారు. కరోనా కొత్త వేరియంట్ పై వస్తున్న వార్తల నేపథ్యంలో దీనిపైనే కీలకంగా చర్చించే అవకాశం ఉన్నది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ వేరియంట్ లో 32 మ్యూటేషన్లు ఉన్నట్టు ఇప్పటికే పరిశోధకులు తెలిపారు.
డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైనది కావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఈ వేరియంట్ సోకుతుందని వస్తున్న వార్తలపై ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన చర్చించబోతున్నారు. కొత్త వేరియంట్‌తో పాటుగా వ్యాక్సినేషన్‌పై కూడా చర్చించబోతున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!