విదేశీ ప్రయాణికులపై ఏపీ స్పెషల్ ఫోకస్

- November 29, 2021 , by Maagulf
విదేశీ ప్రయాణికులపై ఏపీ స్పెషల్ ఫోకస్

అమరావతి: ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం విదేశీ ప్రయాణికులపై ఫోకస్ పెట్టింది. సౌత్‌ ఆఫ్రికా, బోట్స్‌వానా, హంగ్‌కాంగ్‌ నుంచి వస్తున్న వారి పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. 12 దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. త్వరలోనే విజయవాడలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ అందుబాటులోకి తెస్తామన్నారు.

విదేశాల నుంచి వస్తున్న వారిలో పాస్‌పోర్ట్‌లో ఏపీ అడ్రస్‌ ఉన్న వారిపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు అధికారులు. ప్రస్తుతం ఏపీలో రికవరీ రేట్‌ 99.20 శాతంగా నమోదైంది. పాజిటివిటీ రేట్‌ 0.64 శాతంగా వుంది. రోజుకు సగటున నమోదవుతున్న కేసులు 197మాత్రమే అని వైద్యశాఖాధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్‌ కోవిడ్ కేసులు 2,140. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ఒక డోస్‌ పొందిన వారు 87.43 శాతం మంది. రెండు డోస్‌లు పొందిన వారు 62.19 శాతం మంది అని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com