బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్టు ప్రారంభంపై రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటన
- November 30, 2021
మనామా:బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్టు (మొదటి ఫేజ్) విషయమై ప్రజా రవాణా విభాగంలో స్థానిక, అంతర్జాతీయ సంస్థల అర్హత టెండరుని రవాణా మరియు టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టుని రూపొందించారు. బహ్రెయిన్ విజన్ 2030లో భాగంగా ఈ మెట్రో ప్రాజెక్టుని చేపడుతున్నారు. మెట్రో విభాగంలో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. ప్రైవేటు విభాగంతో కలిసి పిపిపి విధానంలో ఈ ప్రాజెక్టుని చేపడతారు.మొదటి ఫేజ్ రెండు లైన్లలో మొత్తం 29 కిలోమీటర్ల మేర 20 స్టేషన్లతో నిర్మిస్తారు. ముహరాక్, మనామా, డిప్లమాటిక్ ఏరియా, జుఫ్ఫైర్, సీఫ్ డిస్ట్రిక్ట్, తుబ్లి, అధారి మరియు ఇసా టౌన్లను కలుపుతుంది మెట్రో.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు









