ఒమిక్రాన్ లక్షణాలు.. ముందు జాగ్రత్త..

- December 04, 2021 , by Maagulf
ఒమిక్రాన్ లక్షణాలు.. ముందు జాగ్రత్త..

కోవిడ్ యొక్క కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌కు B.1.1.529 అని కూడా పేరు పెట్టారు. దక్షిణాఫ్రికాలో గత వారం నుండి కోవిడ్ కేసులు బాగా పెరిగాయి. అందుకే ప్రపంచం మొత్తం ఈ రూపాంతరం గురించి భయపడుతోంది. ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్ లక్షణాలు అత్యంత సాధారణంగా ఉంటాయి. జ్వరం, దగ్గు, అలసట, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి కోవిడ్ లక్షణాలే ఇందులో కూడా ఉంటాయి. కళ్లు అలసటగా, ఎరుపు రంగులోకి మారటం, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు, వేళ్లు లేదా కాలి రంగు మారడం వంటి లక్షణాలు తక్కువగా ఉంటాయి.

తీవ్రమైన లక్షణాలు చూస్తే.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస ఆడకపోవడం, తడబడుతూ మాట్లాడడం, ఛాతీ నొప్పి. ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే తక్షణమే కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. కొత్త కోవిడ్ వేరియంట్‌ని గుర్తించిన తర్వాత, SOPలను (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్) అనుసరించాలని WHO దేశానికి మరియు ప్రతి వ్యక్తికి సూచించింది. ఇతర వైవిధ్యాలతో పోలిస్తే ఒమిక్రాన్ మరింతగా వ్యాపిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీని గురించిన అధ్యయనాలు కొనసాగుతున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com