దక్షిణాఫ్రికా పర్యటనకు BCCI గ్రీన్‌సిగ్నల్..
- December 04, 2021
సౌతాఫ్రికాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా వెళ్లాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ పర్యటనలో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడుతుందని బీసీసీఐ కార్యదర్శి జే షా శనివారం నాడు మీడియాకు వెల్లడించారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఆడాల్సిన మూడు టీ20ల సిరీస్‌ను వాయిదా వేస్తున్నామని… ఆ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
కాగా డిసెంబర్ 17 నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. అయితే ఇటీవల దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన బీసీసీఐ సమావేశంలో భారత జట్టు యథావిధిగా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టులకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను రహానె స్థానంలో రోహిత్ శర్మకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!