ఒమిక్రాన్ దెబ్బ..పెరిగిన విమాన ఛార్జీలు..!
- December 04, 2021
ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సిద్ధం అవుతున్నాయి.ఊహించని విధంగా స్పీడ్‌గా విస్తరిస్తూ వస్తున్న ఈ వేరియంట్ ఇప్పటికే 38 దేశాలను తాకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించింది.అయితే, ఇదే సమయంలో విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చాయి.ఇప్పటికే ఒమిక్రాన్ బాధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరి చేశాయి ఆయా దేశాలు.. ఒమిక్రాన్ మరింత విజృంభిస్తే.. మరిన్ని ఆంక్షలు తప్పవని.. అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిస్థాయిలో రద్దుచేసే అవకాశం లేకపోలేదని ప్రచారం కూడా సాగుతోంది.. దీంతో చాలా మంది ట్రావెల్ టికెట్లు బుక్ చేసుకోవడానికి మొగ్గు చూపడంతో.. విమాన ఛార్జీలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయని.. దీనికి పండుగల సీజన్ కూడా తోడు కావడం కూడా విమాన ఛార్జీల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.
కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయంతో భారత్ నుంచి అధిక రద్దీ ఉండే యూఏఈ, అమెరికా, బ్రిటన్, కెనడా లాంటి దేశాలకు విమాన చార్జీలు అమాంతం పెరిగిపోయినట్టు చెబుతున్నారు.. తాజా సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి కెనడాలోని టోరంటోకి గతంలో కనీస ఛార్జీ రూ.80వేలుగా ఉంటే.. ఇప్పుడు ఏకంగా అది రూ. 2.37 లక్షలకు చేరిపోయింది.. ఇక, ఢిల్లీ నుంచి లండన్‌కు గతంలో రూ. 60గా ఉంటే.. ఇప్పుడు రూ.1.20 లక్షలు దాటేసింది.ఢిల్లీ నుంచి దుబాయ్‌కి రూ.20 వేలుగా ఉన్న టికెట్ ధర ఇప్పుడు రూ.33 వేల వరకు పెరిగింది.ఇతర దేశాలకు కూడా ఇదే పరిస్థితి ఉందని సమాచారం.. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే రెట్టింపు డబ్బును ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏదైనా సరే.. కరోనా మరింత విస్తరించకముందే గమ్యానికి చేరుకోవాలని ప్రయాణికులు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడంలేదని తెలుస్తోంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!