భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో షేక్ మొహమ్మద్ భేటీ

- December 05, 2021 , by Maagulf
భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో షేక్ మొహమ్మద్ భేటీ

యూఏఈ: అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్డ్మ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అబుధాబిలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌తో భేటీ అయ్యారు. కస్ర్ అల్ షాతిలో జరిగిన ఈ సమావేశంలో  షేక్ మొహమ్మద్, జైశంకర్ వ్యూహాత్మక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసే అంశాలపై చర్చించారు. స్థానిక, అంతర్జాతీయ అంశాలతో పాటు ప్రస్తుత పరిణామాలపై ఇరువురు అభిప్రాయాలను పంచుకున్నారు. ఫిప్త్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు జైశంకర్ అబుదాబి వచ్చారు. అటు యూఏఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా జరుగుతుండటంతో  ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తరుఫున యూఏఈ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత అభివృద్ధి చెందాలని అబుధాబి ప్రిన్స్  ఆకాంక్షించారు. సమావేశంలో విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబుధాబి ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ షేక్ మహ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్, సుప్రీం కౌన్సిల్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ అలీ మహ్మద్ హమ్మద్ అల్ షమ్సీ పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com