కరోనా యాంటీబాడీల సమర్థతను గుర్తించే ర్యాపిడ్ పరీక్ష!
- December 05, 2021
కాలిఫోర్నియా: కరోనా సోకడం లేదా టీకా తీసుకోవడం ద్వారా శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు.. ఒమిక్రాన్ సహా వివిధ వేరియంట్లను ఎంత సమర్థంగా అడ్డుకోగలవన్నది తెలుసుకునేందుకు సరికొత్త ర్యాపిడ్ పరీక్ష అందుబాటులోకి వచ్చింది!
ఈ పరీక్ష ద్వారా వివిధ వేరియంట్లకు వ్యతిరేకంగా ఒక వ్యక్తికి ఎంతమేర రక్షణ ఉందన్నది తెలుసుకునే అవకాశముంది. డ్యూక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సాగించిన ఈ పరిశోధన వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ పత్రిక అందించింది. వ్యక్తులకు ఏ వేరియంట్ సోకింది? వారిలో ఏ తరహా యాంటీబాడీలు, ఏ స్థాయిలో ఉన్నాయి? వివిధ వేరియంట్లకు వ్యతిరేకంగా అవి ఎంత సమర్థంగా పనిచేస్తాయి? అన్న విషయాలను తెలుసుకునేందుకు ప్రస్తుతం ఎలాంటి ర్యాపిడ్ పరీక్షలూ అందుబాటులో లేవు. దీంతో శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధన సాగించి 'కోవేరియంట్- న్' అనే పరీక్షను రూపొందించారు.
ఇది ఎలా పనిచేస్తుంది?
''నిర్దిష్ట బయోమార్కర్లను మాత్రమే గుర్తించేలా పాలిమర్ బ్రష్ కోటింగ్‌తో ఒక ఫలకను రూపొందించాం. దీనికి ఒక వైపు మనిషిలో ఉండే 'ఏసీఈ2' ప్రొటీన్లను ఉంచాం. కరోనా స్పైక్ ప్రొటీన్లు లక్ష్యం చేసుకునేది వీటినే. మరోవైపు- అదే ఫలకపై కొన్నిచోట్ల వివిధ వేరియంట్లకు చెందిన స్పైక్ ప్రొటీన్లను ముద్రించాం. పరీక్ష సమయంలో ఏసీఈ2 ప్రొటీన్లు స్పైక్ ప్రొటీన్లతో అతుక్కుపోయాయి. తదుపరి పరీక్షలో వివిధ రకాల యాంటీబాడీలను కూడా ఫలకపై ఉంచాం. అప్పుడు కొన్ని స్పైక్ ప్రొటీన్లు ఏసీఈ2 రిసిప్టర్లను గ్రహించలేదు. మరికొన్ని కొంతవరకే వాటితో అతుక్కున్నాయి. ఆ సమయంలో కొన్ని బల్బులు పూర్తిగా వెలగలేదు. బల్బులు కాంతిని ప్రసరించే తీరును బట్టి.. ఒక వ్యక్తిలోని యాంటీబాడీలు వివిధ వేరియంట్లకు వ్యతిరేకంగా ఎంత సమర్థంగా పనిచేయగలవన్నది తెలుసుకోవచ్చు'' అని పరిశోధనకర్త కామెరాన్ వోల్ఫ్ వివరించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!