'గుడ్‌ లక్‌ సఖి' విడుదల తేదీ ఖరారు

- December 05, 2021 , by Maagulf
\'గుడ్‌ లక్‌ సఖి\' విడుదల తేదీ ఖరారు

హైదరాబాద్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్.ఆతర్వాత ఈ అమ్మడు వరుస సినిమాలతో తెలుగులో బిజీ అయ్యింది కీర్తి.నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. తాజాగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి.ఈ చిత్ర విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్‌ ప్రకటించింది.ఈ చిత్ర విడుదలను ఎందుకో పలు కారణాల వల్ల దర్శక నిర్మాతలు వాయిదా వేశారు.ఇది వరకు నవంబర్ 26న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. కానీ డిసెంబర్‌లో భారీ చిత్రాల రీలీజ్‌లు ఉండటంతో మేకర్స్‌ వెనుకడు వేస్తున్నారని సమాచారం.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్‌ ప్రకటించింది.డిసెంబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుందని మేకర్స్‌ ప్రకటించారు.

ఈ ఏడాది విడుదలయ్యే ఆఖరి టాలీవుడ్‌ సినిమా ఇదే కానుంది.నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న గుడ్ లక్ సఖి చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. చిరంతాన్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లు అన్నీ కూడా విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి. కాగా గ్రామీణా నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com