భారత్‌లో 21కి చేరిన ఒమిక్రాన్ కేసులు..
- December 05, 2021
న్యూ ఢిల్లీ: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా నెమ్మదిగా వ్యాపిస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో బయటపడ్డ ఈ వేరియంట్ ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటి వరకు 38 దేశాలకుపైగా పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలో మరో కేసు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా మహారాష్ట్రలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. సౌతాఫ్రికా నుంచి దుబాయ్ మీదుగా ముంబైకి వచ్చిన ప్రయాణికుడికి ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు భారత్‌లో మొత్తం 21 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీనిపై ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఆంక్షలను కఠినతరం చేశాయి.
సౌతాఫ్రికాలో బయటపడ్డ ఈ కొత్త వేరియంట్ యావత్తు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విజృంభిస్తోంది. డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపించ గుణం ఉన్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. రోజురోజుకు చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా ఈ రోజు మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా రాజస్థాన్‌లో నమోదైన 9 కేసులతో భారత్‌లో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 21కి చేరింది. ప్రస్తుతం రాజస్తాన్‌లో 9, మహరాష్ట్రలో 8, కర్ణాటకలో 2, ఢిల్లీ, గుజరాత్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!