ఆర్ఆర్ఆర్ నుంచి కొమురం భీమ్ పోస్టర్..

- December 06, 2021 , by Maagulf
ఆర్ఆర్ఆర్ నుంచి కొమురం భీమ్ పోస్టర్..

ఆర్ఆర్ఆర్ నుంచి కొమురం భీమ్ పోస్టర్..


హైదరాబాద్:ఇద్దరూ స్టార్ హీరోలతో కలిసి దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాను చూసేందుకు అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియోస్ నెట్టింట్లో సంచలనం రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్‏ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ముందుగా ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల చేయాల్సి ఉంది.కానీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతోపాటు.. కొన్ని అనుకోని కారణాల వలన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వాయిదా వేశారు.ఆ తర్వాత డిసెంబర్ 9న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చేయనున్నట్లుగా ప్రకటించారు.ట్రైలర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఆర్ఆర్ఆర్ నుంచి సర్ ప్రైజ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటేస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు.రక్తంతో తడిచిన శరీరంతో రెండు చేతులతో తాడులను ఆగ్రహంతో కనిపిస్తున్నాడు తారక్. ఇక ఎన్టీఆర్ కొమురం భీమ్ లేటేస్ట్ పోస్టర్ అదిరిపోయిందంటూ తారక్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.ఇక సాయంత్రం 4 గంటలకు రామ్ చరణ్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com