అబుధాబి రోడ్లపై డ్రైవర్ లేని ట్యాక్సీల సందడి
- December 06, 2021అబుధాబి: అబుధాబి ఎమిరేట్‌లో డ్రైవర్ లేని ట్యాక్సీలు సందడి చేస్తున్నాయి.దీనికి సంబంధించి అబుధాబి అథారిటీస్ ఓ వీడియో విడుదల చేశాయి.ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.మిడిల్ ఈస్ట్‌లో తొలిసారిగా డ్రైవర్ లేని వాహనాల్ని నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.మొత్తం ఐదు కార్లను రంగంలోకి దించారు. యాస్ ఐలాండ్‌లో ఫార్ములా వన్ రేస్ ట్రాక్ మరియు ఫెర్రారీ వరల్డ్ థీమ్ పార్కులో కార్లను వినియోగిస్తున్నారు. వీటన్నిటికీ సేఫ్టీ ఆఫీసర్ ఆన్ బోర్డ్ సౌకర్యం వుంది. పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు స్మార్ట్ జియోగ్రాఫికల్ ఎకో సిస్టమ్ అలాగే అవసరమైన సెన్సార్లు పొందుపరిచారు. రెండో ఫేజ్ ద్వారా అబుధాబిలోని పలు రోడ్లపై ఈ వాహనాల్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు.
--నవీన్.వై(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు