నిర్వహణ పనుల నిమిత్తం పలు రోడ్లను తాత్కాలికంగా మూసివేయనున్న మస్కట్ మునిసిపాలిటీ

- December 06, 2021 , by Maagulf
నిర్వహణ పనుల నిమిత్తం పలు రోడ్లను తాత్కాలికంగా మూసివేయనున్న మస్కట్ మునిసిపాలిటీ

మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, నిర్వహణ పనుల నిమిత్తం పలు రోడ్లను నేటి నుంచి (డిసెంబర్ 6) నుంచి డిసెంబర్ 10 వరకు తాత్కాలికంగా మూసివేయనున్నారు. కుర్రమ్ కమర్షియల్ ప్రాంతంలో ఈ మూసివేత అమల్లో వుంటుంది.పాడైపోయిన రోడ్లకు మరమ్మత్తులు చేయనున్నారు. ట్రాఫిక్ విభాగం చేసిన సూచనలకు అనుగుణంగా వాహనాల్ని నడపాల్సిందిగా వాహనదారులకు అథారిటీస్ సూచించాయి.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com