ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్సు జారీ కోసం కొత్త విధివిధానాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం
- December 07, 2021
కువైట్: కువైట్ లో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది. విదేశాల నుంచి వచ్చిన వారు, దేశీయంగా పెరుగుతున్న వాహనాల వినియోగం కారణంగా ట్రాఫిక్ హెవీగా అవుతోంది. దీంతో ట్రాఫిక్ సమస్య ను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారికి డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చే విషయంలో కాస్త కఠినంగా ఉండాలని భావిస్తోంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించాలంటే ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్సుల జారీని తగ్గించే విధంగా కొత్త నిబంధనలు తేనుంది. ఇందుకు సంబంధించిన పలు అధ్యయనాలను పరిశీలిస్తోంది. సోమవారం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైసల్ అల్ నవాఫ్ ట్రాఫిక్ విభాగం అధికారులతో సమావేశమై పలు ప్రతిపాదనలపై చర్చించారు. ట్రాఫిక్ సమస్యను తగ్గించే ఎలాంటి పద్దతులను అవలంభించాలో కూడా స్టడీ చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను కోరారు. అనంతరం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ మాట్లాడుతూ... కువైట్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ ట్రాఫిక్ వ్యవస్థల్లో ఒక్కటిగా తయారుచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







