ఎమిరేట్స్ ప్రయాణికులకు గుడ్ న్యూస్..

- December 07, 2021 , by Maagulf
ఎమిరేట్స్ ప్రయాణికులకు గుడ్ న్యూస్..

యూఏఈ: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో పలు దేశాలు ఇంటర్నేషనల్ ట్రావెల్ గైడ్ లైన్స్ ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ తమ ప్యాసింజర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎమిరేట్స్ ప్రయాణికులకు కోవిడ్-19 ట్రావెల్ ఇన్సూరెన్స్ ను అందించడం కంటిన్యూ చేయనున్నట్లు తెలిపింది. అయితే డిసెంబర్ 1, 2021న తర్వాత కొనుగోలు చేసిన టికెట్ లకు మల్టీ-రిస్క్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ వర్తించదని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ స్పష్టం చేసింది. దీని బదులుగా కోవిడ్-19 మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ వర్తిస్తుందని తెలిపింది. దుబాయ్ ఆధారిత క్యారియర్ కు విదేశీ వైద్య ఖర్చులు, అత్యవసర తరలింపు అలాగే కొన్ని ఇతర ఖర్చుల కోసం $500,000 వరకు మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com