సౌదీలో గడ్డకట్టే చలికాలం నేటి నుంచి ప్రారంభం

- December 07, 2021 , by Maagulf
సౌదీలో గడ్డకట్టే చలికాలం నేటి నుంచి ప్రారంభం

సౌదీ అరేబియా: సౌదీ వాతావరణ నిపుణులు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం డిసెంబర్ 7 నుంచి గడ్డ కట్టే చలికాలం ప్రారంభమైంది. అల్ మురాబానియాగా పిలవబడే ఈ సీజన్ డిసెంబర్ 7న మొదలై 39 రోజులపాటు కొనసాగుతుంది. డిసెంబర్ 29 నుంచి జనవరి 31 వరకు మరింత తీవ్రమైన చలి వుంటుంది. మంచు బాగా ఎక్కువగా ఈ సమయంలో కురుస్తుంది. ఉష్ణోగ్రతలు ఈ ఏడాది గణనీయంగా తగ్గుతాయని సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో నమోదవుతాయని వాతావరణ నిపుణులు ముందే అంచనా వేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com