నైరోబి జైలులో భారీ అగ్ని ప్రమాదం..38 మంది ఖైదీల సజీవదహనం..
- December 07, 2021
నైరోబి: బురుండి రాజధాని గితెగాలోని ప్రధాన జైలులో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 38 మంది ఖైదీలు మరణించారు. మరో 69మంది ఖైదీలు తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ ఉపాధ్యక్షుడు తెలిపారు. ఖైదీలందరు నిద్రపోతున్న సమయంలో తెల్లవారుజామున 4:00 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. జైలు నుంచి బయటకు వెళ్లలేని ఖైదీలు సజీవ దహనమయ్యారని వైస్ ప్రెసిడెంట్ ప్రాస్పర్ బజోంబాంజా తెలిపాయి. అయితే గీతేగా జైలు మంటలకు కారణమేమిటో చెప్పలేదు. మరణించిన వారిలో చాలా మంది వృద్ధ ఖైదీలు ఉన్నట్లు సమాచారం.
కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మిలటరీ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు.. ఆర్మీ పికప్ ట్రక్కులలో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనపై అధికారులెవరు వ్యాఖ్యానించేందుకు నిరాకరించారని స్థానిక మీడియా తెలిపింది. “మంటలు చాలా ఎక్కువగా ఎగసిపడటం చూశామని, సజీవ దహనం అవుతున్నామని అరవడం ప్రారంభించాము, కాని పోలీసులు మా క్వార్టర్స్ తలుపులు తెరవడానికి నిరాకరించారని ప్రత్యక్ష సాక్షి అయిన ఖైదీ ఒకరు చెప్పారు. “నేను ఎలాగో తప్పించుకున్నాను , కానీ పూర్తిగా కాలిపోయిన ఖైదీలు ఉన్నారు.” అని చెప్పుకొచ్చారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కువ మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, బురుండిలోని రెడ్‌క్రాస్ బృందాలు బాధితులను ఆదుకునేందుకు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, స్వల్పంగా ఉన్న మరికొందరికి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!