పెద్ద మనసు చాటుకున్న లులు గ్రూప్ అధినేత ఎం.ఏ యూసుఫ్ అలీ
- December 09, 2021
కేరళ: లులు గ్రూప్ అధినేత ఎం.ఏ యూసుఫ్ అలీ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఆర్థిక కారణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి అండగా నలిచి.. ఆ కుటుంబం కష్టాలను తీర్చారు.ఈ క్రమంలో ఆయన చేసిన పని స్థానికంగా చర్చనీయాంశం అయింది.కాగా.. ఇంతకూ ఆయన ఏం చేశారు అనే వివరాల్లోకి వెళితే..
లులు గ్రూప్స్ అధినేత యూసుఫ్ అలీ, అతడి కుటంబ సభ్యులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఈ ఏడాది ఏప్రిల్‌లో కేరళలోని పనాన్‌గఢ్‌లో స్వల్ప ప్రమాదానికి గురైంది. దీంతో భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా స్థానిక ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా వారిని ఆసుపత్రికి తరలించే వరకూ అక్కడే ఆశ్రయం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం రోజు యూసుఫ్ అలీ పనాన్‌గఢ్‌లో పర్యటించి.. అక్కడి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా కంజీరామోత్తమ్ ప్రాంతానికి చెందిన అమీనా.. యూసుఫ్ అలీని కలిసి తన కష్టాలను చెప్పుకున్నారు.కూతురు పెళ్లి కోసం భూమి, ఇల్లును తాకట్టు పెట్టి.. లోన్ తీసుకున్నట్టు వెల్లడించారు.అయితే భర్త క్యాన్సర్ చికిత్స కోసం అధిక మొత్తంలో ఖర్చవుతున్నందున లోన్ తీర్చలేదని.. దీంతో బ్యాంక్ వాళ్లు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో యూసుఫ్ అలీ.. ఆమెకు అండగా నిలిచారు. ఆమె కట్టాల్సిన డబ్బును తానే కడతానని పేర్కొన్నారు.చెప్పిన విధంగా రూ. 3.81లక్షలను బ్యాంకులో కట్టేశారు. అంతేకాకుండా..అమీనా భర్త చికిత్స కోసం రూ.50,000 ఆర్థిక సహాయం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!