షువైఖ్‌లో 70 వర్క్‌షాపులకు విద్యుత్ నిలిపివేత

- December 09, 2021 , by Maagulf
షువైఖ్‌లో 70 వర్క్‌షాపులకు విద్యుత్ నిలిపివేత

కువైట్: కువైట్ మునిసిపాలిటీ 1080 ఉల్లంఘనల్ని గుర్తించింది నిర్లక్ష్యంగా వదిలివేయబడ్డ వాహనాలకు సంబంధించి. అలాగే 9 ఇండస్ట్రియల్ వర్క్ సైట్స్‌ని సీజ్ చేశారు అధికారులు. క్యాపిటల్ గవర్నర్ షేక్ తలాల్ అల్ ఖాలెద్ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. 70 వర్క్ షాపులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించి, వాటికి విద్యుత్ సరఫరాని నిలిపివేశారు. ట్రక్కుల కోసం 5 మిలియన్ చదరపు మీటర్ల స్థలాన్ని మునిసిపల్ కౌన్సిల్ కేటాయించినప్పటికీ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కొందరు. దొంగిలించబడిన కార్లను కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com