జనవరి 1న 'ఇందువదన' విడుదల
- December 10, 2021
హైదరాబాద్: యువ కథానాయకుడు వరుణ్ సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇందువదన’. గత చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ మేకోవర్ తో వరుణ్ సందేశ్ ఈ మూవీతో జనం ముందుకు రాబోతున్నాడు. మధ్యలో భార్యతో కలిసి బిగ్ బాస్ సీజన్ 3 లోనూ పాల్గొన్న వరుణ్ సందేశ్ ఆ తర్వాత ఆచితూచి సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. కొన్ని చిత్రాలలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడానికి సైతం వెనుకాడని వరుణ్ సందేశ్ ‘ఇందువదన’లో మాత్రం హీరోగానే నటించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ‘ఇందువదన’ మూవీపై ఆసక్తిని పెంచేలా చేశాయి. ఈ సస్పెన్స్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీలో వరుణ్ సందేశ్ సరసన ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటించింది.
ఎమ్మెస్సార్ దర్శకత్వంలో మాధవీ ఆదుర్తి నిర్మించిన ‘ఇందువదన’ చిత్రానికి శివ కాకాని సంగీతం అందించారు. ఈ మూవీని వచ్చే యేడాది తొలి రోజున అంటే జనవరి 1వ తేదీన వరల్డ్ వైడ్ విడుదల చేయబోతున్నట్టు నిర్మాత మాధవీ తెలిపారు. ఈ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీతో వరుణ్ సందేశ్ రీ-ఎంట్రీ ఇస్తున్నారని, ఆయన పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుందని దర్శకుడు ఎమ్మెస్సార్ చెబుతున్నాడు. సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ లభించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!