ఆర్మ్డ్ ఫోర్సుడ్ డే.. విందు ఇచ్చిన సుల్తాన్

- December 12, 2021 , by Maagulf
ఆర్మ్డ్ ఫోర్సుడ్ డే.. విందు ఇచ్చిన సుల్తాన్

ఒమన్:  ఆర్మ్డ్ ఫోర్సుడ్ డే ని పురస్కరించుకుని సుప్రీం కమాండర్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ సాయుధ దళాలకు డిన్నర్ ఇచ్చారు. అల్ బరాకా ప్యాలెస్‌లో జరిగిన ఈ విందుకు రక్షణ వ్యవహారాల డిప్యూటీ ప్రధాన మంత్రి, మంత్రులు, సుల్తాన్ ఆర్మ్డ్ ఫోర్స్ (SAF), రాయల్ ఒమన్ పోలీస్, సీనియర్ మిలిటరీ, సివిల్ ఆఫీసర్లు, కమాండర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుల్తాన్ సాయుధ దళాలకు అభినందనలు తెలిపారు. భద్రత, సామరస్యం, శాంతి పరిరక్షణకు సాయుధ దళాల చేస్తున్న కృషిని కొనియాడారు. దేశ రక్షణలో సైనికుల అంకితభావానికి, ధైర్యసాహసాలకు ఈ  ఆర్మ్డ్ ఫోర్సుడ్ డే ప్రతీకగా నిలుస్తోందని సుప్రీం కమాండర్ సుల్తాన్ అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com