WHO డైరెక్టర్ జనరల్‌ను కలిసిన అబుదాబి ప్రిన్స్
- December 12, 2021
యూఏఈ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్‌ను అబుదాబి ప్రిన్స్, UAE సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ రోజు కలుసుకుని చర్చించారు. ఈ సందర్భంగా WHO డైరెక్టర్-జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఆరోగ్య సంస్థ లక్ష్యాలను, కోవిడ్-19 వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలను షేక్ మహమ్మద్ కు వివరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై వారు చర్చించారు. ఎమిరేట్స్ లో పోలియో క్యాంపెయిన్, రివర్ బ్లైండ్ నెస్, గినియా వార్మ్ వ్యాధిని నిర్మూలించేందుకు చేస్తున్న షేక్ మహమ్మద్ కృషిని టెడ్రోస్ అభినందించారు. COVID-19 మహమ్మారి నేపథ్యంలో అనేక దేశాలలో వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ కార్మికులకు UAE చేసిన సహాయాన్ని ఆయన ప్రశంసించారు. భవిష్యత్తులో WHO చేపట్టే కార్యక్రమాలకు అండగా నిలుస్తామని, మహమ్మారిని నిర్మూలించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలకు మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ WHO డైరెక్టర్ జనరల్ కు హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!