తెలంగాణ ప్రజా సమితి ఖతార్ వారి కార్తీక మాస వన భోజనాలు

- December 12, 2021 , by Maagulf
తెలంగాణ ప్రజా సమితి ఖతార్ వారి కార్తీక మాస వన భోజనాలు

దోహా: దోహా లో డిసెంబర్ 10వ తేదీ(శుక్రవారం) అల్ దూసరి పార్కులో తెలంగాణ ప్రజా సమితి వారు నిర్వహించిన కార్తీక మాస వన భోజనాలు పచ్చని చెట్ల మధ్య ప్రకృతి ఒడిలో ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా ఐ.సి.బి.ఎఫ్ రజనీ మూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

తెలంగాణ ప్రజా సమితి కుటుంబ సభ్యులు ..మరియు బంధు మిత్రులు అందరూ ఒకచోట చేరి ఆనందంగా పచ్చని చెట్ల పచ్చని చెట్ల మధ్య ప్రకృతిని ఆస్వాదిస్తూ కమ్మని విందు భోజనాలు ఆరగించారు అనంతరం పిల్లలు పెద్దలు ఆటపాటల్లో మునిగి తేలారు మరియు దసరా ఉత్సవాల్లో వారి వారి ప్రదర్శనతో అలరించిన వారందరికీ బహుమతులు అందజేశారు మరియు వాలంటరీ స్ కి అప్రిషియేట్ సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది.కార్యక్రమంలో భాగంగా  తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు గద్దె శ్రీనివాస్ మాట్లాడుతూ... ఇలా వన భోజనాలు చేయడం వల్ల ఆధ్యాత్మిక ఫలితాలు ఆరోగ్యంతో పాటు ప్రజల్లో ఆత్మీయతానురాగాలు పెంపొందుతాయని  సామాజిక సామరస్యత కు సమైక్యతకు దోహదం చేస్తుందన్నారు.ఈ కార్యక్రమ విజయవంతానికి కృషిచేసిన న తెలంగాణ ప్రజా సమితి కార్యవర్గానికి మరియు అత్యధిక సంఖ్యలో హాజరైన తెలంగాణ ప్రజా సమితి కుటుంబ సభ్యులకి మరియు వాలంటరీ స్ & QNTO ఫుడ్ టీం కు కృతజ్ఞతలు తెలిపారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com