మంచు విష్ణు సంచలన నిర్ణయం..
- December 12, 2021
హైదరాబాద్: ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు.‘మా’ ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు ఆమోదించారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన శ్రీకాంత్, ఉత్తేజ్ సహా మొత్తం 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. రాజీనామాలు చేయొద్దని కోరినా, వెనక్కి తీసుకోమన్నా వాళ్లు అంగీకరించలేదని.. అందుకే ఆమోదించామని క్లారిటీ ఇచ్చారు విష్ణు. అయితే ప్రకాష్ రాజ్, నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ వాళ్ల రిజైన్లను మాత్రం ఆమోదించలేదన్నారు విష్ణు. ‘మా’ బిల్డింగ్పై చర్చలు జరుగుతున్నాయని.. వారం, పదిరోజుల్లో నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తామన్నారు.
‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిపొందారని ఈసీ అనౌన్స్ చేసిన మరుసటి రోజే తన ‘మా’ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకోనున్నట్టు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన ప్రకాశ్… ఆ తరువాత తన ప్యానెల్ నుంచి గెలిచిన వారు కూడా పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి… బెదిరించి… డబ్బుతో ఓటర్లను ఆకర్షించి గెలిచారని మీడియా వేదికగా విష్ణుపై ఫైర్ అయ్యారు.అయితే ప్రకాశ్ అండ్ టీం రాజీనామాలపై అప్పట్లోనే స్పందించిన విష్ణు.. వారి రాజీనామాలను స్వీకరించేది లేదని మీడియా ముఖంగా చెప్పారు. ఓటమి బాధలో నిర్ణయం తీసుకున్నారంటూ పెద్దరికంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు.
కానీ ఉన్నట్టుండి.. తాజాగా ప్రకాశ్ రాజ్ ప్యానల్లో గెలిచిన అభ్యర్థుల రాజీనామాలను విష్ణు ఆమోదించారు. ఇక ‘మా’ ప్యానల్లో వారు ఉండలేరని తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!