ముగిసిన సాయితేజ అంత్యక్రియలు..

- December 12, 2021 , by Maagulf
ముగిసిన సాయితేజ అంత్యక్రియలు..

ఏపీ:తమిళనాడులో హెలికాప్టర్​ ప్రమాదంలో మృతిచెందిన లాన్స్ నాయక్​ సాయితేజ అంత్య క్రియలు సైనిక లాంఛ‌నాల‌తో ముగిశాయి.సాయితేజ సొంత గ్రామ‌మైన చిత్తూరు జిల్లా ఎగువ‌రేగ‌డ గ్రామంలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.సాయితేజ‌కు నివాళులు అర్పించేందుకు గ్రామ‌స్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు.సాయితేజ పార్ధీవ‌దేహాన్నిచూసి కుటుంబ‌స‌భ్యులు క‌న్నీరుమున్నీర‌య్యారు.సాయితేజ భౌతిక‌కాయం చూసి ఆయ‌న భార్య సొమ్మ‌సిల్లి ప‌డిపోయింది.  

సాయితేజ అమ‌ర్ ర‌హే అంటూ నినాదాలు చేశారు.అశ్రున‌య‌నాల మ‌ధ్య సాయితేజ అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయి.త‌మిళ‌నాడులోని స‌ల్లూరు ఎయిర్‌బేస్ నుంచి వెల్లింగ్ట‌న్ లోని ఆర్మీ కాలేజీకి ఎంఐ హెలికాప్ట‌ర్‌లో సీడీఎస్ బిపిన్ రావ‌త్‌, ఆయ‌న భార్య మ‌ధులిక‌, 11 మందిసైనికాధికారులు ప్ర‌యాణం చేస్తుండ‌గా కూనూరు వ‌ద్ద హెలికాప్టర్ ప్ర‌మాదానికి గురై కూలిపోయింది.ఈ ప్ర‌మాదంలో బిపిన్‌రావ‌త్ తో స‌హా 12 మంది మృతి చెందారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com