ఘనంగా ముగిసిన సావిత్రి 86వ జయంతి ఉత్సవాలు

- December 12, 2021 , by Maagulf
ఘనంగా ముగిసిన సావిత్రి 86వ జయంతి ఉత్సవాలు
“వరుసగా ఆరు రోజులు జరిగిన “మహానటి సావిత్రి 86వ జయంతి ఉత్సవాలు” విజయవంతంగా ముగిసాయి. వంశీ, శుభోదయం గ్రూప్ నిర్వహణలో ఐదు ఖండాలలోని తొమ్మిది దేశాలనుండి 80మంది రచయితలు, రచయిత్రులు మహానటి సావిత్రి నటించిన 80 చిత్రాలలో “సావిత్రి నటనా వైదుష్యం” పై ప్రసంగించారు.   
 
ఈ కార్యక్రమానికి వంశీ వ్యవస్థాపక అధ్యక్షులు,డాక్టర్ వంశీ రామరాజు స్వాగత వచనాలు పలకగా ఎంతో ఉత్సాహంగా రచయిత్రి కవిత బేతి మరియు మాధవి బైటారు, ఖతార్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. వంశీ రామరాజు మాట్లాడుతూ వంశీ-శుభోదయం సంస్థలు ‘మహానటి నటనా వైదుష్యం’ పుస్తకము ప్రచురిస్తామని చెప్పారు.
 
ముఖ్య అతిధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ పూర్వ ఉపసభాపతి,మండలి బుద్ధప్రసాద్  ప్రసంగిస్తూ, ‘ఒకసారి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగు చలన చిత్ర నటీనటులు అందరూ దేశరక్షణ నిధికి ఎంతో కొంత విరాళం అందించారు. ఆ టైంలో ఒళ్ళంతా బంగారు నగలతో ఉన్న సావిత్రిగారు నగలన్నీ తీసి ఆయన చేతిలో పెట్టారు. ఆవిడ చేసిన దానాలకి లెక్కలేదు. విజయ చాముండేశ్వరి భర్త, రావు ఊరు వడ్డెవారిపాలెంలో ఉన్న పేద విద్యార్థుల కోసం ఒక హైస్కూల్ పెట్టారు.టీచర్లకు జీతాలు ఇచ్చి ఎంతో తపన పడి స్కూల్ నడిపించారు. అలా విద్యాదానం చేశారు. ఈరోజు కూడా ‘సావిత్రి గణేషన్ హై స్కూల్’ అక్కడ ఉంది., ఆవిడ కేవలం నటీమణి కాకుండా ఒక గొప్పదాత” అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. “ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు ఆమెని సన్మానించినప్పుడు ఒకే ఒక్కసారి ఆవిడని చూస్తే అదృష్టం నాకు కలిగింది”, అని అన్నారు.  
 
ఈరోజు కార్యక్రమానికి హాజరైన జమున మాట్లాడుతూ... “సావిత్రి మహానటిగా అందరి హృదయాలలో నిలిచిపోయింది”, అంటూ సావిత్రి ప్రేమైక మూర్తి అని తమ ఇద్దరికీ ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పారు.మొదటిసారి దుగ్గిరాలలో కలుసుకున్నామని, తర్వాత ‘మిస్సమ్మ’లో కలిసి నటించామని, “సావిత్రి నటనలో నాకు నచ్చింది ‘మూగమనసులు’ సినిమాలో ‘ముద్దబంతి పువ్వులో’ అన్న పాటలో తన కళ్ళ తోనే అభినయస్తుంది, అది చాలా ఇష్టం”, అని తమ ఇద్దరికీ కుక్కలు అంటే ఎంతో ఇష్టమని, షూటింగ్ కి కూడా కుక్కలని వెంటబెట్టుకుని వెళ్లి వాళ్ళమని గుర్తుచేసుకున్నారు.తన 86వ పుట్టినరోజున ఇంతమంది తన సినిమాల గురించి మాట్లాడడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. 
 
విజయ చాముండేశ్వరి మరియు రావు ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరి ప్రసంగాలని విని ఎన్నో విషయాలను  ప్రస్తావించారు. 
 
అద్భుతంగా జరిగినఈ కార్యక్రమానికి చైర్మన్ శుభోదయం గ్రూప్, డాక్టర్ కలపటపు లక్ష్మీప్రసాద్ తమ సహకారం అందించారు, మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది. 
 
శుభోదయం గ్రూపు  ప్రసన్న లక్ష్మి తమ వందన వచనాలు తెలుపగా,  శైలజా సుంకరపల్లి మేనేజింగ్ ట్రస్టీ, వంశీ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రి ఈ సినిమాల గురించి రచయిత్రులు “సావిత్రి నటనా వైదుష్యం”పై తన ప్రసంగాలను వినిపించారు.
 
మరో ప్రపంచం - సతీష్ గొల్లపూడి, న్యూజీ ల్యాండ్  
మా బాబు - డా. ఎల్లాప్రగడ రామకృష్ణ రావు, ఆస్ట్రేలియా 
కన్యాశుల్కం - తెన్నేటి శ్యామ కృష్ణ, ఆస్ట్రేలియా 
కుటుంబ గౌరవం - దివ్యశ్రీ కొప్పోల్ –ఆస్ట్రేలియా
పెళ్ళి చేసి చూడు--స్వాతి జంగా, సింగపూర్
జీవిత రంగం - మీగడ త్రినాథ రావు, మలేసియా
వేంకటేశ్వర మహత్యం - మాధవి బైటారు, ఖతార్
భలే అమ్మాయిలు -  లక్ష్మి కామేశ్వరి పులిపాక, ఒమాన్
పల్లెటూరు -  పత్తిపాటి సుభాషిణి, ఇండియా  
భలేరాముడు - నండూరి సుందరీ నాగమణి, ఇండియా  
సంతానం - పద్మ చిల్లరిగె, ఇండియా  
తల్లి ప్రేమ - నామాని సుజనా దేవి, ఇండియా  
తల్లిద్రండులు -డా. వి. నాగరాజ్యలక్ష్మి, ఇండియా  
వింత సంసారం - డా. దేవులపల్లి వాణి, ఇండియా  
కంచుకోట- డా.S.R.S  కొల్లూరి , ఇండియా  
అప్పు చేసి పప్పుకూడు - కిరణ్మయి గోళ్లమూడి, ఇండియా 
కలసివుంటే కలదు సుఖం - వాణి ఉప్పుల, కెనడా
దేవత - ఝాన్సీలక్ష్మి, కెనడా
విచిత్రకుటుంబం - సువర్ణ విజయ లక్ష్మి, కెనడా
మిస్సమ్మ - కొండపల్లి నిహారిణి, అమెరికా  
నవరాత్రి - తులసి చట్టి, కెనడా
బాంధవ్యాలు - కొమ్మారెడ్డి గుణ సుందరి, అమెరికా 
చరణదాసి - అన్నాజీ  చిల్లరిగే, అమెరికా
 బండరాముడు - వాణికృష్ణంశెట్టి, కెనడా 
 
చివరగా సురేఖ మూర్తి దివాకర్ల, సావిత్రి సినీ గీతాలపై విశ్లేషణ చేస్తూ కొన్ని మధురమైన పాటలు  వినిపించడంతో ఈ కార్యక్రమం ముగిసింది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com