ముగిసిన సాయితేజ అంత్యక్రియలు..
- December 12, 2021
ఏపీ:తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్య క్రియలు సైనిక లాంఛనాలతో ముగిశాయి.సాయితేజ సొంత గ్రామమైన చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.సాయితేజకు నివాళులు అర్పించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.సాయితేజ పార్ధీవదేహాన్నిచూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.సాయితేజ భౌతికకాయం చూసి ఆయన భార్య సొమ్మసిల్లి పడిపోయింది.
సాయితేజ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.అశ్రునయనాల మధ్య సాయితేజ అంత్యక్రియలు పూర్తయ్యాయి.తమిళనాడులోని సల్లూరు ఎయిర్‌బేస్ నుంచి వెల్లింగ్టన్ లోని ఆర్మీ కాలేజీకి ఎంఐ హెలికాప్టర్లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 11 మందిసైనికాధికారులు ప్రయాణం చేస్తుండగా కూనూరు వద్ద హెలికాప్టర్ ప్రమాదానికి గురై కూలిపోయింది.ఈ ప్రమాదంలో బిపిన్‌రావత్ తో సహా 12 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!