నేడు ప్రారంభం కానున్న అల్ ఖోర్ మాల్ మల్టీప్లెక్స్

- March 23, 2016 , by Maagulf
నేడు ప్రారంభం కానున్న అల్ ఖోర్ మాల్ మల్టీప్లెక్స్


లులు గ్రూప్ అల్ ఖోర్ మార్కెట్ వద్ద మూడు తెరల మల్టీప్లెక్స్  గురువారం నుంచి ప్రారంభం కానుంది.  కతర్ బహరేన్ సినిమా కంపెనీ ప్రకారం, దోహా వెలుపల ఇది  మొదటి సాధారణ సినిమాహాలు . బుధవారం ఒక కంపెనీ అధికారి తెలిపిన సమాచారం ప్రకారం, మూడు తెరలు కలిసి 500  పైగా ప్రేక్షకులు కూర్చొని వీక్షించే అవకాశం ఉందని అన్నారు. గతంలో మూడు తెరలకు కలిపి కేవలం 277 మంది మాత్రమె కూర్చేనే వీలు ఉండేది. మిగిలిన  రెండు తెరలకు  వరుసగా 146, 82 సీట్లు కల్గి ఉన్నాయి. 
అల్ ఖోర్ నివాసితులు సినిమా మందిరాలు పట్ల  మంచి ప్రోత్సాహాన్ని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారని  అయితే, తమ సంస్థ సినిమా మందిరాలు ప్రారంభంతో ఉత్తర పురపాలక పట్టణం యొక్క స్థానిక జనాభా దీర్ఘ కాల డిమాండ్ నెరవేర్చామని కంపనీ అధికారి పేర్కొన్నారు.  
ఇక్కడ ప్రారంభ సినిమాగా  బాట్మాన్ వర్సెస్  సూపర్మ్యాన్ ( త్రీ డి  మరియు సాధారణ రెండు) మరియు బాలీవుడ్ చిత్రం రాకీ హ్యాండ్సమ్   మూడు తెరల మల్టీప్లెక్స్ వద్ద చూపబడుతుందాని ఆ  అధికారి తెలిపారు. రాకీ హ్యాండ్సమ్ సినిమా మధ్యాహ్నం 12 : 30 గంటలకు, సాయంత్రం  3 :15 గంటలకు, 6 గంటలకు, రాత్రి  8 :45 గంటలకు 11: 30  చూపబడుతుంది.
అలాగే  బాట్మాన్ వర్సెస్ సూపర్మ్యాన్  త్రీ డి  సినిమా ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 5 గంటలకు, రాత్రి 8 గంటలకు 11 గంటలకు ప్రదర్శించబడుతుంది
సాధారణ సినిమా మధ్యాహ్నం 12  గంటలకు, 3 గంటలకు, సాయంత్రం  6 గంటలకు, రాత్రి 9 గంటలకు 12 అర్ధరాత్రి వరకు ప్రదర్శించనున్నారు. కాగా నేడు ( గురువారం )  ఉదయం 10 గంటలకు  క్లుప్తమైన ప్రారంభోత్సవ వేడుక నిర్వహించనున్నారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com