సరైన సమాచారం లేకపోవడంతో 41 శాతం వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల తిరస్కరణ

- December 13, 2021 , by Maagulf
సరైన సమాచారం లేకపోవడంతో 41 శాతం వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల తిరస్కరణ

కువైట్: విదేశాల నుంచి వచ్చిన 539,708 కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లలో 344,746 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆమోదం పొందాయి. 194,962 సర్టిఫికెట్లు తిరస్కరణకు గురయ్యాయి. 41 శాతం సర్టిఫికెట్లు తిరస్కరణకు గురవడానికి కారణం సమాచారాన్ని సరిగా పేర్కొనకపోవడంకాగా, 29 శాతం సర్టిఫికెట్లు స్పష్టంగా లేకపోవడంతో తిరస్కరించబడ్డాయి. జతపరిచిన ఇతర ఫైల్స్ సమాచారం సరిగ్గా లేని కారణంగా 27 శాతం తిరస్కరణలు జరిగాయి. మూడు శాతం సర్టిఫికెట్లు, కువైట్‌లో అనుమతి లేకపోవడంతో తిరస్కరించబడ్డాయి. పేరు, పుట్టిన తేదీ, నేషనాలిటీ వంటి వివరాల్ని కొందరు తప్పుగా నమోదు చేశారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,దివాకర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com