రియాద్‌లో బుధవారం నుంచి ‘ఇంటర్నేషనల్ డేట్స్ ఎగ్జిబిషన్’

- December 15, 2021 , by Maagulf
రియాద్‌లో బుధవారం నుంచి  ‘ఇంటర్నేషనల్ డేట్స్ ఎగ్జిబిషన్’

సౌదీ: రియాద్‌లో బుధవారం నుంచి ఇంటర్నేషనల్ డేట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేషనల్ సెంటర్ ఫర్ పామ్స్ అండ్ డేట్స్ పర్యవేక్షణలో ఐదు రోజులపాటు ఈ ప్రదర్శన జరుగుతుంది.ఇందులో స్థానిక, అంతర్జాతీయ ఉత్పత్తిదారులు, రైతుల పాల్గొననున్నారు. ప్రపంచంలోనే ఈ తరహా ఎగ్జిబిషన్ లలో ఇది అతి పెద్దది. ఈ సందర్భంగా పలు వర్క్ షాప్‌లు, ప్రెజెంటేషన్‌లు, విద్యా కార్యక్రమాల వంటి అనేక అనుబంధ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఖర్జూర అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలతో పాటు 43 స్థానిక, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలు ఈ భారీ ప్రదర్శనలో పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com