అవసరానికి తగ్గట్టు వ్యాక్సిన్లను మార్చాలి: భారత కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ చీఫ్‌

- December 15, 2021 , by Maagulf
అవసరానికి తగ్గట్టు వ్యాక్సిన్లను మార్చాలి: భారత కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ చీఫ్‌

న్యూఢిల్లీ : కరోనా సరికొత్త రూపం ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న ఆందోళనల మధ్య.. కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ చీఫ్‌ డా.వికె పాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

వేరియంట్లు తమ స్వభావాన్ని మార్చుకుంటున్న నేపథ్యంలో.. ఆ మ్యూటెంట్లకు తగ్గ వ్యాక్సిన్లను భారత్‌ కలిగి ఉండాలని అన్నారు. కోవిడ్‌ వ్యాప్తి తక్కువ లేదా మధ్యస్థ స్థాయిలో ఉన్న చోటే విలక్షణ దిశలో కదులుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో టీకాలు అసమర్థవంతంగా పనిచేసే అవకాశాలు లేకపోలేదని, గత మూడు వారాల నుండి ఇటువంటి సందేహాలే తలెత్తాయని, వీటిలో కొంత నిజం ఉన్నప్పటికీ.. తుది ఫలితం తెలియదని అన్నారు. బి.1.1.529 వేరియంట్‌ను నవంబర్‌ 24న దక్షిణాఫ్రికాలో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) గుర్తించింది. కాగా, దీన్ని అడ్డుకునేందుకు సమర్థవంతమైన వ్యాక్సిన్లను కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com