మానస్ హీరోగా ‘5 జీ లవ్’!
- December 15, 2021
చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన మానస్ నాగులపల్లి ఇప్పుడు హీరోగా, విలక్షణ నటుడిగా టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో చోటు సంపాదించుకుని టాప్ ఫైవ్ లో నిలిచాడు. అతి త్వరలోనే బిగ్ బాస్ లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. దాంతో సహజంగానే అతను నటిస్తున్న, నటించబోతున్న సినిమాలకు కొంత క్రేజ్ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో అతనితో ఓ సినిమా నిర్మించబోతున్నట్టు స్క్వేర్ ఇండియా స్టూడియోస్ అధినేత ప్రతాప్ కొలగట్ల తెలిపారు. గతంలో ‘3 జీ లవ్’ సినిమా నిర్మించిన ఆయన ఇప్పుడీ సినిమాకు ‘5 జీ లవ్’ అనే పేరు ఖరారు చేశారు. రాజ్ ముదునూరు దర్శకత్వం వహిస్తున్న మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. కథ ప్రకారం ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారని, అందులో మానస్ ఒకరని, పలు హిట్ చిత్రాలకి సంగీతం అందించిన శేఖర్ చంద్ర తమ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారని ప్రతాప్ చెప్పారు.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







