బూస్టర్‌డోస్‌గా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కు ఈయూ అనుమతి
- December 15, 2021
లండన్ : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యూరోపియన్ యూనియన్‌లో విలయం సృష్టిస్తున్నది. కొత్త స్ట్రెయిన్ బారినపడ్డ ఓ వ్యక్తి ఇప్పటికే మరణించాడు.
ఈ క్రమంలో యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకున్నది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన కొవిడ్-19 టీకాను బూస్టర్ డోసుగా వేసేందుకు అనుమతి ఇచ్చింది.
ఈయూ డ్రగ్ రెగ్యులేటర్ బుధవారం సిఫారసు చేసింది. ఫైజర్-బయోఎన్‌టెక్, మోడెర్నా టీకాలతో పాటు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (EMA) నిర్ధారించిన వ్యాక్సిన్ల (mRNA)లో ఏదైనా ఒక టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత మూడో డోసుగా జాన్సన్ అండ్ జాన్సన్ టీకా వేసేందుకు అనుమతి ఇచ్చింది. గత నెలలో దక్షిణాఫ్రికాలో గుర్తించిన కొత్త వేరియంట్‌తో యూకేలో ఓ వ్యక్తి మరణించిన అనంతరం ఆయూ దేశాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి.
టీకాతో రక్షణ వస్తున్నందున బూస్టర్ డోస్‌లు వేసేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ఈయూ మెడిసిన్స్ ఏజెన్సీ ఫైజర్, మోడెర్నా టీకా రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోస్ వేసేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే ఆస్ట్రాజెనెకా టీకాను సైతం బూస్టర్ డోస్ వేసే అంశాన్ని పరిశీలిస్తున్నది.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







