పేర్ని నాని చేతుల్లోకి సినిమాటోగ్రఫీ శాఖ
- December 15, 2021
ఏపీ: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పేర్ని నానికి సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పటికే మంత్రి పేర్ని నాని రవాణా, సమాచార శాఖ బాధ్యతలు చూస్తున్నారు. అయితే ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయం హాట్ టాపిక్‌గా మారాయి. టికెట్ల ధరలు పెంచడం కుదరదని ఇటీవల ఏపీ ప్రభుత్వం జీవో 35ను ప్రవేశపెట్టింది. పెద్ద, చిన్నా అని తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధరలు వర్తిస్తాయని జీవోలో పేర్కొంది. అయితే ఏపీ ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టుల ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేస్తూ.. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు టికెట్లపై నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తే ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. అయితే డివిజన్ బెంచ్‌లో విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ల ధరలన విషయలో విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ క్రమంలో మంత్రి పేర్ని నానికి సినిమాటోగ్రఫీ శాఖను సీఎం అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజా వార్తలు
- HR88B8888 నంబర్‌కు అపార డిమాండ్
- హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్ఐ పై షాకింగ్ నిజాలు
- లోక్‌సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?







