చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ గా సైన్యాధిపతి జనరల్ నరవణెకు బాధ్యతలు

- December 16, 2021 , by Maagulf
చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ గా సైన్యాధిపతి జనరల్ నరవణెకు బాధ్యతలు

న్యూ ఢిల్లీ: చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ గా సైన్యాధిపతి జనరల్ M.M. నరవణె బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా ఈ కమిటీకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఛైర్మన్ గా ఉంటారు.

ప్రస్తుత CDS జనరల్ బిపిన్ రావత్ మరణంతో ఖాళీగా ఉన్న ఈ స్థానంలో త్రివిధ దళాల అధిపతుల్లో సీనియర్ అయిన నరవణెను కమిటీ ఛైర్మన్ గా నియమించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. CDS పదవిని సృష్టించక ముందు మూడు దళాల అధిపతుల్లో సీనియర్ గా ఉన్న వ్యక్తి ఛైర్మన్ గా వ్యవహరించేవారు. ఆర్మీ, వాయుసేన, నావికా దళాల అధ్యక్షులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఎయిర్ చీఫ్ మార్షల్ VR చౌధరి సెప్టెంబర్ 30న వాయుసేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించగా. నేవీ చీఫ్ గా అడ్మిరల్ R.హరికుమార్.నవంబర్ 30న పదవిలోకి వచ్చారు. జనరల్ నరవణె మాత్రం.2019 డిసెంబర్ నుంచి ఆర్మీ చీఫ్ గా కొనసాగుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com