'పుష్ప' సినిమా 5వ షో కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- December 16, 2021
హైదరాబాద్: ఐకాన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. బన్నీ నటించిన.. పుష్ప సినిమా 5 వ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.రేపు పుష్ప సినిమా విడుదల కానున్న నేపథ్యంలోనే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 17 వ తేదీ నుంచి… ఈ నెల 30 వ తేదీ వరకు అంటే.. దాదాపు రెండు వారాల పాటు… పుష్ప సినిమా 5 వ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు అధికారిక జీవో ను జారీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో… ఈ మూవీ నిర్మాణ సంస్థకు భారీగానే లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక కేసీఆర్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం తో.. బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఏపీలోనూ ఈ నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా.. రేపు వరల్డ్ వైడ్ గా థియేటర్లలో పుష్ప సినిమా విడుదల కానుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!