మూడు గంటల్లో 2,840 వాహనాలకు చలానాలు

- December 17, 2021 , by Maagulf
మూడు గంటల్లో 2,840 వాహనాలకు చలానాలు

కువైట్: జలీబ్ అల్-షుయూఖ్, కబ్ద్, షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాల్లో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ టెక్నికల్ ఇన్స్పెక్షన్ టీం భారీ ఎత్తున వాహనాల చెకింగ్ చేపట్టింది. మూడు గంటలపాటు సాగిన ఈ చెకింగ్ లో భద్రతా నియమాలు, వాహన నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 2,840 వాహనాలకు చలానాలు జారీ చేశారు. ట్రాఫిక్ సెక్టార్ అండర్ సెక్రటరీ, మేజర్ జనరల్ జమాల్ అల్-సాయెగ్ సూచనల మేరకు భారీ ఎత్తున వాహన తనిఖీలు చేపట్టారు. టెక్నికల్ ఇన్‌స్పెక్షన్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ కల్నల్ మిషాల్ అల్-సువైజీ పర్యవేక్షణలో అధికారులు, సైనికులు, ఇంజనీర్‌లతో సహా 8 భద్రతా బృందాలు ఈ భారీ వాహన తనిఖీల్లో పాల్గొన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com