ఒమన్ ప్రభుత్వ ప్రాయోజిత వంటగ్యాస్ సబ్సిడీలపై ఇక కోత
- March 24, 2016
ఒమన్ ప్రభుత్వ ప్రాయోజిత వంటగ్యాస్ సబ్సిడీలపై ఇక కోత విధించే విషయమై యోచిస్తోంది. ఒమన్ ద్రవీకృత పెట్రోలియం వాయువు (ఎల్ పి జీ ) రాయితీలకల తగ్గించాలని ఆలోచిస్తున్నట్లు, ఇంధన మరియు సహజ వాయువు మంత్రిత్వశాఖ సహాయ కార్యదర్శీ సేలం బిన్ నాసర్ అల్ ఔఫీ బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం త్వరలో వంటగ్యాస్ కోసం రాష్ట్ర రాయితీలు కత్తిరించనున్నట్లు తెలిపారు. వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్థలకు రాష్ట్ర సబ్సిడీలపై కోత విషయం పై గత ఐదు సంవత్సరాలుగా ఇవ్వాలా వద్దా అనే విషయంపై చర్చ ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉందన్నారు.అయితే వారికి ఒక మార్కెట్ ధరను ఏర్పాటు చేయాలని ఒమాన్ ప్రభుత్వం పెర్కొంతున్నప్పటకీ, అది కార్యాచరణ దాల్చడం లేదని అల్ ఔఫీ పేర్కొన్నారు. ద్రవీకృత పెట్రోలియం వాయువు (ఎల్ పి జీ ) రాయితీలను సుల్తానేట్ ప్రాంతంలో కత్తిరించడం వలన సిమెంట్, ఉక్కు మరియు పింగాణీ పలకలను తయారు చేసే పలు పరిశ్రమలు, పారిశ్రామిక యూనిట్ల ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి వివరాల ప్రకారం ఒమన్ ప్రభుత్వం గత సంవత్సరం 7.3 బిలియన్లను అమెరికా డాలర్లను ఇంధన రాయతీలను అందించింది
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







