ఐఏఎంసీని ప్రారంభించిన సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్
- December 18, 2021
హైదరాబాద్: దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం (ఐఏఎంసీ) హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. నానక్‌రాంగూడ ఫొనిక్స్ వీకే టవర్‌లో 25వేల చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాంగణాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు కేసీఆర్ అప్పగించారు. అనంతరం ఇద్దరూ కలిసి ఐఏఎంసీలోని వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఏర్పాటవుతున్న ఈ కేంద్రానికి శాశ్వత భవనం కోసం భూకేటాయింపులు కూడా పూర్తయ్యాయి.

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటిఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, ట్రస్టీలు – సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమాకోహ్లి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?







