ఒమన్ లో ఘనంగా ఖతార్ నేషనల్ డే వేడుకలు
- December 19, 2021
ఒమన్: ఖతార్ నేషనల్ డే ని పురస్కరించుకొని ఒమన్ సెక్రటేరియట్ జనరల్ ఆఫ్ నేషనల్ సెలబ్రేషన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. విలాయత్ ఆఫ్ సీబ్‌లోని అల్ మౌయి మస్కట్‌లోని ఓపెన్ స్టేజ్‌లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.సుల్తానేట్‌లోని ఖతార్ రాయబారి షేక్ జాసిమ్ అబ్దుల్‌రహ్మాన్ అల్ థానీ, సెక్రటేరియట్ జనరల్ ఆఫ్ నేషనల్ సెలబ్రేషన్స్ సెక్రటరీ జనరల్ షేక్ సబా బిన్ హమ్దాన్ అల్ సాదీలు ఈ సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడాలని వారు ఆకాంక్షించారు.వీరితోపాటు రెండు దేశాల ఉన్నతాధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు.వేడుకల సందర్భంగా రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ మ్యూజిక్ యూనిట్ మ్యూజిక్ బ్యాండ్స్, ఇతర కల్చరల్ యూనిట్ల సభ్యులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







