తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న చలిపులి

- December 19, 2021 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న చలిపులి

తెలుగు రాష్ట్రాల్లో మరింత చలి తీవ్రత పెరగనుంది.రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతుండడంతో.. బయటకు రావాలంటేనే జనం వణుకుతున్నారు. ప్రదానంగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో అతి స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలు చలికి గజగజలాడుతున్నాయి. పది డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం, చల్లని గాలులు వీస్తుండడంతో.. బయటకు రావాలంటే జనం వణికిపోతున్నారు. ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తుండడంతో.. ఉష్ణోగ్రతలు దారుణంగా పతనమవుతున్నాయంటున్నారు వాతావరణశాఖ అధికారులు

రాత్రి పూట ఉష్ణోగ్రతలు అత్యంతస్వల్పంగా నమోదవుతుండడం, ఉదయం పది గంటల వరకూ మంచుప్రభావం కనిపిస్తుండడంతో… చలి అధికంగా ఉంటోంది. దీంతో జనం చలిమంటల దగ్గరే కాలం గడుపుతున్నారు. ఓవేళ బయటకు రావాలన్నా స్వెట్టర్లు, రగ్గులతో కాలం గడుపుతున్నారు.

విశాఖలో ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకు అటు,ఇటుగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా జి.మాడుగులలో ఆరు డిగ్రీలు నమోదు కాగా… లమ్మసింగి,ఇతర ప్రాంతాల్లోనూ అంతే స్థాయిలో ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. ..కుమ్రం భీం జిల్లాలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోను ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయాయి. గత రికార్డులు పరిశీలిస్తే…1970 డిసెంబర్ 12న సిటీలో 7.5 డిగ్రీల స్వల్ప ఉష్ణోగ్రత నమోదైంది. 1945 జనవరి 8న 6.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖలో పది డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని, ఇక ఏజెన్సీ ప్రాంతమైన అరకులో.. పండుగలోపు ఐదు డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com