క్రూజ్‌ షిప్పులో క‌రోనా క‌ల‌క‌లం...

- December 21, 2021 , by Maagulf
క్రూజ్‌ షిప్పులో క‌రోనా క‌ల‌క‌లం...

ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద క్రూజ్ షిప్పుగా పేరుగాంచిన ది రాయ‌ల్ క‌రేబియ‌న్ సింఫ‌నీ ఆఫ్ సీస్ ఇప్పుడు క‌రోనా క్ల‌స్ట‌ర్‌గా మారిపోయింది.ఈ షిప్పులో 6 వేల మంది ప్ర‌యాణికులు ప్ర‌యాణం చేస్తుండ‌గా అందులో ఒక‌రు అనారోగ్యం బారిన ప‌డ్డారు.షిప్పులోనే ఆమెకు టెస్టులు చేయ‌గా క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగింది.వెంట‌నే ఆమెతో కాంటాక్ట్‌లో ఉన్న వారికి టెస్టులు నిర్వ‌హించారు.

మొత్తం 48 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌ర‌గ‌డంతో షిప్పులు ఫ్లోరిడాలోని మియామీ బీచ్‌లో నిలిపివేశారు.రాయ‌ల్ క‌రేబియ‌న్ సింఫ‌నీ ఆఫ్ సీస్ క‌రోనా క్ల‌స్ట‌ర్‌గా మారింది.ఈ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు.వీరికి సోకింది క‌రోనా పాజిటివ్‌నా లేక ఒమిక్రాన్ వేరియంటా అన్న‌ది తెలియాల్సి ఉంది.క‌రోనా సోకిన 48 మందికి షిప్పులోనే ఐసోలేష‌న్‌లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com