జీవితం రద్దవడం కంటే కార్యక్రమాలు రద్దవడమే మంచిది:WHO

- December 22, 2021 , by Maagulf
జీవితం రద్దవడం కంటే కార్యక్రమాలు రద్దవడమే మంచిది:WHO

జెనీవా: మానవ సమాజం కరోనా పూర్వపు స్థితికి చేరుకుంటోందనుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా ముంచుకొచ్చిన ముప్పు ‘ఒమైక్రాన్’. ప్రస్తుతం ఐరోపా దేశాలు, అమెరికాలో ‘ఒమైక్రాన్’ ప్రబల కరోనా వేరియంట్‌గా రూపాంతరం చెందింది. ఇప్పటికే పలు ఐరోపా దేశాలు ఒమైక్రాన్ కట్టడి కోసం కఠిన ఆంక్షలకు తెరతీసాయి. అయితే.. క్రిస్మస్ సమీపిస్తుండటంతో పండగ మూడ్‌లోకి వెళ్లిపోయిన ప్రజలు.. కరోనా ఆంక్షల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ విహారయాత్రలు, ఇతర వేడుకలు రద్దైపోయినందుకు చింతిస్తున్నారు. 

ఈ పరిణామాం పలు దేశాల్లో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా ఆంక్షల పట్ల ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకత చూసి బెదిరిపోతున్న ప్రభుత్వాలు ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేసేందుకు జంకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రయాణాలు, ఇతర కార్యక్రమాలు రద్దైపోతున్నందుకు ప్రజలు చింతించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ‘‘జీవితం రద్దవడం కంటే..కార్యక్రమాలు రద్దైపోవడమే మంచిది’’ అని వ్యాఖ్యానించారు. సోమవారం జరిగిన ఓ పత్రికాసమావేశంలో టెడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వేడుకలు చేసుకుని ఆ తరువాత చింతించడం కంటే  కార్యక్రమాలను మరో రోజుకు వాయిదా వేసుకోవడమే మంచిదని ప్రజలకు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com