బూస్టర్ డోస్ తో తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు అడ్డుకట్ట
- December 23, 2021
ఖతార్: ఒమిక్రాన్ వేరియంట్ తోపాటు తీవ్రమైన ఇన్ఫెక్షన్‌లను నివారించడంలో బూస్టర్ డోస్ ప్రభావవంతంగా పనిచేస్తుందని తాజా క్లినికల్ ట్రయల్స్ రుజువు చేశాయని ఖతార్ పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ (MoPH) తెలిపింది.కోవిడ్ నివారణలో భాగంగా అందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది. వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ వ్యాక్సిన్ అవసరాన్ని సమర్థించే అధ్యయనాలు అంతర్జాతీయంగా జరిగాయని మంత్రిత్వ శాఖ నిన్న ట్వీట్ చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ బూస్టర్ డోస్ తీసుకుంటేనే కరోనా నుంచి రక్షణ పొందవచ్చని స్టడీల్లో తేలినట్లు గుర్తు చేసింది.లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధకులు కోవిడ్-19 బూస్టర్ షాట్ ద్వారా ఒమిక్రాన్ తో తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా.. హాస్పిటలైజేషన్ నుంచి 85 శాతం రక్షణను అందిస్తుందని తేల్చినట్లు ఖతార్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..